ప్రేయసి ఆత్మహత్యను తట్టుకోలేక.. ప్రియుడు ఆత్మహత్య..!

కులం అడ్డుగోడలకు ప్రేయసి బలైంది.. ఆమె లేని జీవితం వద్దనకున్నాడు ప్రియుడు.. సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కడపలో వెలుగులోకి వచ్చింది. రొంపిచెర్ల మండలం గానుగచింతకు చెందిన పి.శివశంకర్(25) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అదే పంచాయతీలోని లోకవారిపల్లెకు చెందిన శిల్ప అనే యువతితో ప్రేమలో పడ్డాడు.

అయితే వీరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఐదు నెలల కింద శిల్ప ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేయసి చనిపోవడంతో శివశంకర్ తీవ్రంగా కుంగిపోయాడు. దీంతో తల్లిదండ్రులు నెలక్రితం తిరుపతిలోని తమ కుమార్తె ఇంటికి పంపించారు. అయితే ఈనెల 2న తిరుపతిలోని తన అక్కడ ఇంటి నుంచి వచ్చేశాడు.. కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా స్విచ్ఛాఫ్ చేసేవాడు. 

ఈక్రమంలో పీలేరు-కడప మార్గంలోని వేంకటేశ్వరస్వామి ఆలయం వెనుక గురువారం చింతచెట్టుకు ఉరి వేసుకున్నాడు. ‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. శిల్ప లేకుండా నేను బతకలేకపోతున్నా’ అంటూ సూసైడ్ నోట్ రాసి జేబులో పెట్టుకున్నాడు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.   

 

Leave a Comment