జాబ్ క్యాలెండర్ వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!

రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేయాలనుకున్న జాబ్ క్యాలెండర్ ప్రకటన వాయిదా పడింది. ఉగాది రోజున సీఎం జగన్ క్యాలెండర్ విడుదల చేస్తారని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే తిరుపతి లోక్ సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో క్యాలెండర్ ప్రకటన కొన్ని వారాలు వాయిదా పడినట్లు తెలుస్తోంది..

ప్రభుత్వ విభాగాలైన గ్రామ, వార్డు సచివాలయాల్లోని 8,402 పోస్టులు, యానిమల్ హజ్బెండరీ శాఖలో 6099 ఖాళీలు, పోలీస్ శాఖలో 6 వేలు, విద్యుత్ శాఖ జేఎల్ఎం పోస్టులు, ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి డీఎస్సీ, ఇతర శాఖల్లో ఖాళీలను క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే తిరుపతి ఉప ఎన్నిక  ప్రక్రియ పూర్తయిన తర్వాత హెడ్యూల్ విడుదల చేయనున్నారు. 

మరోవైపు వివిధ విభాగాల్లోని ఖాళీల డేటాను సేకరించి, వాటిని కూడా కలిపి షెడ్యూల్ ను ఒకేసారి విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పోస్టుల భర్తీపై ఖాళీల సమాచారం అందించాలని ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్ని ప్రభుత్వ విభాగాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే..

Leave a Comment