ఏపీలో రిటైర్మెంట్ వయసు 62 ఏళ్లకు పెంపు.. నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత..!

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్ మెంట్ పై ప్రకటన చేసింది. 23 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెంచిన కొత్త జీతాలు జనవరి 1, 2022 నుంచి చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై రూ.10,247 కోట్ల అదనపు భారం పడనుంది..

నిరుద్యోగుల నుంచి వ్యతిరేకత:

ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుతూ తీసుకున్న నిర్ణయం పట్ల సోషల్ మీడియాలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే 58 ఏళ్లు ఉన్న పదవి విరమణ వయసును చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు సీఎం జగన్ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఇలా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచుకుంటూ పోతుంటే నిరుద్యోగుల పరిస్థితి ఏంటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వయసు పెంచుకుంటూ పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడిస్తారని అడుగుతున్నారు. ఇది జనగ్ ప్రభుత్వం తీసుకున్న చెత్త నిర్ణయం అని మండిపడుతున్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 55 సంవత్సరాలకు తగ్గించాలని సోషల్ మీడియాలో నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారు. 

సచివాలయ నోటిఫికేషన్ తర్వాత ఏపీలో సరైన నోటిఫికేషన్ ఒక్కటి కూడా రాలేదు. జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగులను ఊరించింది. అయితే నిరుద్యోగుల విషయంలో అందులోనూ విఫలమైంది. లక్షల మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లలో కోచింగ్ లు తీసుకొని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఉద్యోగులు రిటైర్ అయితే ఖాళీలు ఏర్పడతాయి కదా అని అందరూ భావించారు. కానీ జగన్ సర్కార్ వారి ఆశలపై నీళ్లు పోసింది. ఇంకా రెండేళ్ల వరకు రిటైర్మెంట్ అనేది లేకుండా చేసింది. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులు చనిపోయేంత వరకు ఉద్యోగంలో పెట్టండంటూ నిరుద్యోగులు కామెంట్లు  చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయంపై మీ స్పందన ఏంటో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.. 

Leave a Comment