శ్రీశైలంలో బయటపడ్డ పురాతన వెండి నాణేలు, శాసనాలు 

ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో  పురాతన వెండి నాణేలు, తామ్ర శాసనాలు బయటపడ్డాయి. పంచమఠాల్లో ఒకటైన ఘంటామఠం ప్రధానాలయానికి ఎదురుగా ఉన్న ఉపాలయ గోడల మధ్య ఇవి లభ్యమయ్యాయి.  245 వెండి నాణేలె, ఒక రాగి నాణెం, మూడు తామ్ర శాసనాలు(రాగి రేకులు) లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. 

తామ్ర శాసనాల్లో నాగరి, కన్నడ లిపి, శివలింగాన్ని రాజు మొక్కుతుండటం, నంది, గోవు చిత్రాలు ఉన్నాయన్నారు. 97 వెండి నాణేలు విడిగా లభించాయని, 148 నాణేలు ఇత్తడి పాత్రలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నాణేలు 1800 నుంచి 1910 మధ్య బ్రిటీష్ కాలంలో తయారైనవిగా అధికారులు గుర్తించారు. కాగా, ఈనెల 7, 8 తేదీల్లో 29 తామ్ర శాసనాలు లభించాయి. 

 

 

Leave a Comment