రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ!.. ఎవరిని చేసుకుందంటే..?

యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఢీ, జబర్దస్త్ షోలతో మంచి క్రేజ్ తెచ్చున్న రష్మీ టాప్ యాంకర్ గా దూసుకుపోతుంది. బుల్లితెరపైనే కాకుండా సినిమాల్లోనూ అడపాదడపా పాత్రల్లో కనిపిస్తూ అందరినీ అలరిస్తోంది. ఇక రష్మీ, సుధీర్ జోడి గురించి చెప్పనవసరం లేదు. వీరి ప్రేమ వ్యవహారం చాలా కాలంగా నడుస్తూ ఉంది. అయితే తాము ఇద్దరం మంచి స్నేహితులమని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ ఎన్నో పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. 

తాజాగా రష్మీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతేడాది లాక్ డౌన్ లో రష్మీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. రష్మీ ఓ ప్రైవేట్ సంస్థలో మేనేజర్ గా పనిచేస్తున్న వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకుందట.. అయితే పెళ్లి విషయం బయటకు తెలిస్తే కెరీర్ పరంగా సమస్యలు వస్తాయని భయపడి.. ఈ విషయం సీక్రెట్ గా ఉంచిదని వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ విషయంపై రష్మీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.   

Leave a Comment