యాంకర్ ప్రదీప్ తో శ్రీముఖి పెళ్లి..ఇదిగో వెడ్డింగ్ కార్డ్!

ప్రముఖ టీవీ యాంకర్లు ప్రదీప్, శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నారట.. ఈ మేరకు వెడ్డింగ్ కార్డు కూడా రెడీ అయింది. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే ఈ పెళ్లి గురించి పూర్తి క్లారిటీ రావాలంటే దసరా వరకు ఆగాల్సిందే.. టీవీ ఛానెళ్లు ప్రతి పండగకి ఏదో ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తుంటాయి. అందులో భాగంగానే రాబోతున్న దసరాకు ఓ ఈవెంట్ ని ప్లాన్ చేసింది జీతెలుగు ఛానెల్.. 

ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేసింది. యాంకర్స్ పదీప్ , శ్రీముఖికి పెళ్లంటూ ఓ ప్రోమోనూ పెట్టింది. ఈ ప్రోమోలో చిరంజీవి ప్రదీప్ కి.. చిలసౌ శ్రీముఖి నమస్కరిస్తూ వ్రాయునది అంటూ వెడ్డింగ్ కార్డును బయటకు వదిలింది. ‘ఈ లేఖలో  ఏముందో తెలుసుకోవాలని ఉందా? అయితే చూడండి దసరా స్పెషల్ ఈవెంట్’ అంటూ తన ప్రోగ్రాంపై హైప్ తీసుకొచ్చింది. 

Leave a Comment