గుడిలో సారంగదరియా పాటకు డ్యాన్స్.. యాంకర్ పై ట్రోలింగ్..!

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా నుంచి సారంగదరియా అనే పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ పాటలో సాయి పల్లవి చేసిన స్టన్నింగ్ డ్యాన్స్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా టాలెంటెడ్ ఆర్టిస్ట్ చాలా మంది సారంగదరియా పాటకు డ్యాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. 

తాజాగా టిక్ టాక్ స్టార్, ప్రముఖ టీవీ షో యాంకర్ దీపికా పిల్లి కూడా సారంగదరియా పాటకు స్టెప్పులు వేసింది. ఎంతో జోష్ తో దీపికా డ్యాన్స్ చేసింది. ఆమె అద్భుతమైన డ్యాన్స్ ఎంతో మంది నెటిజన్ల మనసు దోచుకుంది. అయితే మరి కొందరు నెజిటన్లు ఆమెపై మండిపడుతున్నారు.  ఈ పాటకు ఆమె గుడిలో డ్యాన్స్ చేయడమే అందుకు కారణం. ఇలాంటి పాటకు గుడిలో డ్యాన్స్ చేయడమేంటి అని కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే చాలా మంది ఆమె డ్యాన్స్ ను మెచ్చుకుంటున్నారు. సూపర్ డాన్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.   

Leave a Comment