పోలీసుల ముందే వ్యక్తి కాల్చేవేసిన ఎమ్మెల్యే అనుచరుడు..!

యూపీలో ఎమ్మెల్యే అనుచరుడు బరితెగించాడు. పోలీసులు, అధికారుల ముందే ఓ వ్యక్తిని కాల్చి చంపేశాడు. రేషన్ దుకాణాల కేటాయింపు సందర్భంగా జరిగిన వివాదంలో బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ అనుచరుడు ధీరేంద్ర సింగ్.. జయప్రకాశ్(48) అనే వ్యక్తిని తుపాకీతో కాల్చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

వివరాల మేరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ ఇద్దరు హాజరయ్యారు. ఇక్కడ వీరిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.  దీంతో ధీరేంద్ర తన తుపాకీతో జయప్రకాశ్ పై కాల్పులకు తెగబడ్డాడు. హత్య జరిగిన సమయంలో పోలీసులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ధీరేంద్ర సింగ్ బల్లియా బీజేపీ ఎక్స్- సర్వీస్ మెన్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నాడు.  

 

Leave a Comment