పాములా చర్మాన్ని వదులుతున్న యువకుడు..!

బీహార్ కి చెందిన ఓ యువకుడు అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు.. కొన్ని రోజులకు ఒకసారి పాము కుబుసం వదిలినట్లు చర్మాన్ని వదులుతుంటాడు.. ఈ సమస్య వల్ల ఆ యువకుడు నలుగురిలో తిరగలేకపోతున్నాడు.. ఇతరులతో కలవలేకపోతున్నాడు.. అయితే ఎంత బాధ ఉన్నా.. ఆ యువకుడు మాత్రం అధైర్య పడటం లేదు. 

బీహార్ కి చెందిన 25 ఏళ్ల మజిబర్ రెహ్మాన్ మాలిక్ అనే యువకుడు ఎరిత్రోడెర్మా అనే అరుదైన చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇది ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి వల్ల అతడి చర్మం వాచిపోతూ పొట్టుగా రాలిపోతుంటుంది. దీనివల్ల అతడి చర్మం ఎర్రగా కమిలిపోతుంది. ఈ పరిస్థితిని ‘రెడ్ మ్యాన్ సిండ్రోమ్’ అని కూడా పిలుస్తుంటారు. 

 పుట్టక నుంచే రెహ్మాన్ మాలిక్ కి ఈ సమస్య మొదలైంది. ప్రతి వారం అతడు కుబుసం విడుస్తున్నట్లుగా చర్మాన్ని వదులుతాడు. చలికాలం వచ్చిందంటే మరింత నరకం. అతడ చర్మం పొడిగా మారిపోయి చిట్లిపోతుంది. 

చికిత్స కోసం స్థానికంగా ఎన్నో ఆస్పత్రులకు తిరిగాడు. అయితే.. ఈ వ్యాధికి ఇక్కడ చికిత్స లేదని, పెద్ద ఆస్పత్రులకు వెళ్లాలని వైద్యులు సూచించారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడి కుటుంబం పెద్ద ఆస్పత్రులకు వెళ్లే ప్రయత్నం చేయలేదు. ఈ సమస్య కారణంగా మాలిక్ ను అందరూ స్నేక్ మ్యాన్ అని పిలుస్తుంటారు. 

అయితే, మాలిక్ మాత్రం తనకు ఉన్న సమస్య గురించి ఆలోచిస్తూ బాధ పడటం లేదు. ఇన్ స్టాగ్రామ్ వీడియోలు చేస్తే తన సమస్య గురించి ఇతరులకు వివరిస్తున్నాడు. తనకు తన స్నేహితులు, తన కుటుంబం తోడుగా ఉందని చెబుతున్నాడు. తాను సంతోషంగానే ఉన్నట్లు చెప్పాడు. ఈ చర్మ సమస్య వల్ల మాలిక్ కళ్లు ఎర్రగా మారిపోయాయి. ఒక కంటికి చూపు కూడా పోయింది. ఇంకో కన్ను కూడా క్రమేనా చూపును కోల్పోతున్నట్లు మాలిక్ చెప్పాడు.

 

Leave a Comment