పట్టాలపై చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు ఖరీదైన బైక్ గిఫ్ట్..!

ఇటీవల రైల్వే ప్లాట్ ఫామ్ పై నుంచి ప్రమాదవశాత్తు పట్టాలపై పడిన ఓ చిన్నారిని రైల్వే ఉద్యోగి తన ప్రాణాలకు తెగించి కాపాడిన సంగతి తెలిసిందే.. ఈ దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డయి వీడియో వైరల్ అయింది. దీంతో మయూర్ షెల్కె అనే రైల్వే ఉద్యోగి ఒక్కసారిగా నేషనల్ హీరో అయిపోయాడు. భారతీయ రైల్వే ఆ ఉద్యోగికి రూ.50 వేలు బహుమతిగా ఇచ్చింది. అందులో సగం డబ్బును మయూర్ ఆ చిన్నారికే ఇస్తానని ప్రకటించాడు. దీంతో మరింత మంది మనసులు గెలుచుకున్నాడు. 

తాజాగా జావా మోటార్ సైకిల్స్ కోఫౌండర్ అనుపమ్ తరేజా రైల్వే ఉద్యోగి మయూర్ కు ఖరీదైన బైక్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు. ముందుగా మాట ఇచ్చినట్లే మయూర్ కు బైక్ ఇచ్చినట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. జావా ఫార్టీ టూ బైక్ ను మయూర్ అందుకున్నాడు. నెబ్యులా బ్లూ కలర్ లో ఉన్న ఈ బైక్ ధర రూ.లక్షన్నరకు పైనే ఉంటుంది. ఈ బైక్ ని ఈ మధ్యే లాంచ్ చేశారు.  

Leave a Comment