శరీరాలు అతుక్కొని పుట్టినా.. సర్కారీ జాబ్ కొట్టారు..!

సంకల్పం ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదు.. అని నిరూపించారు ఈ అవిభక్త కవలలు..తమ శారీరక లోపాన్ని అధిగమించి మరీ సర్కారీ కొలువు సంపాదించారు. అమృత్ సర్ కి చెందిన అవిభక్త కవలల పేర్లు సోహ్నా, మోహ్నా.. వీరు 2003, జూన్ 14న ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో జన్మించారు. వీరిద్దరికీ గుండె, కిడ్నీలు, చేతులు, వెన్నెముక వేర్వేరుగా ఉన్నా.. లివర్ గాల్ బ్లాడర్, కాళ్లు మాత్రం కలిపి ఉన్నాయి. 

అలా శరీరాలు అతుక్కొని పుట్టడంతో తల్లిదండ్రులు ఆస్పత్రిలోనే వదిలేసి వెళ్లిపోయారు. వీరిని ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు పరిశీలించి.. సర్జరీ చేస్తే వీరిలో ఒకరు కూడా బతకరని తేల్చారు. వీరిని పంజాబ్ లోని ఆలిండియా పింగల్వారా ఛారిటబుల్ సొసైటీ దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసింది. వీరిద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా చేశారు. 

అంతేకాదు వార తమ శారీరక లోపాన్ని అధిగమించి కష్టపడి చదువుకోవడమే కాక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ లో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించారు. ఈ అవిభక్త కవలలను డిజేబుల్ కోటాలో రిక్రూట్ చేసుకున్నట్లు పీఎస్పీసీఎల్ సీఎండీ వేణు ప్రసాద్ తెలిపారు. వారిద్దరికీ కలిపి రూ.20 వేల జీతం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉద్యోగం రావడం పట్ల అవిభక్త కవలలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన పంజాబ్ ప్రభుత్వానికి, తమకు విద్యనందించిన పింగల్వార్ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు.    

Leave a Comment