అమ్మఒడి అమలు చేస్తాం : మంత్రి సురేష్

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, సంక్షేమ పథకాలు నిలిపేయాలంటూ ఎన్నికల కమిషనర్ ఉత్వర్వులు జారీ చేశారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో అమ్మఒడి పథకం అమలు అవుతుందా లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు.

రాష్ట్రంలో అమ్మఒడి పథకం యధాతథంగా అమలు చేస్తామని ఆయన  వెల్లడించారు. జీవో నంబర్ 3 విడుదల చేశామని, రాష్ట్రంలో 44,08,921 మందికి అమ్మఒడి వర్తింపు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. సోమవారం తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదును సీఎం జగన్ జమ చేస్తారని మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఎమ్మెల్యేలు అమ్మఒడి కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు. 

Leave a Comment