అమ్మ ఒడి ఎడిట్ అప్షన్ వివరాలు..

ఏపీ అమ్మ ఒడి కార్యక్రమానికి సంబంధించి ఇంకా డబ్బులు రాని వారు లక్ష మంది పైనే ఉన్నారు. వీరందరూ ఎడిట్ ఆప్షన్ కోసం హెచ్ఎం లాగిన్ లో ఎడిట్ చేయడానికి ప్రయత్నించారు. కొంత మంది ఎంఈవో కార్యాలయంలో, మరి కొంత మంతి సచివాలయాల్లో ప్రయత్నించారు. అయితే ఈ ఎడిట్ ఆప్షన్ కు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్ డేట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మేము మీకు తెలియజేయబోతున్నాం..

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జనవరి 9న అమ్మ ఒడికి సంబంధించిన డబ్బులు రిలీజ్ చేశారు. చాలా మందికి అమ్మ ఒడి డబ్బులు అయితే రావడం జరిగింది. ఇంకా లక్ష మందికి పైగా పెండింగ్ లో ఉండిపోయాయి. అకౌంట్ నెంబర్ కానివ్వండి, కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని, కారు ఉందని వివిధ కారణాల వల్ల వారికి డబ్బులు క్రెడిట్ కాలేదు. చాలా మందికి ఎంఈవో కార్యాలయానికి వెళ్లి ఎడిట్ చేసుకోండి అని చెప్పారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక అప్ డేట్ ఇచ్చారు. మీకు సమీపంలోని గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ఉద్యోగికి ఎడిట్ ఆప్షన్ కోసం ఒక ఆప్షన్ ఇచ్చారు. నవశకం వెబ్ సైట్ నందు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ లో అమ్మ ఒడి ఇన్ ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు వచ్చిన వారు, వారి objections ను గతంలో ఎంఈవో లాగిన్ లో సబ్మిట్ చేయని వారి అభ్యంతరాలను WEA లాగిన్ లో ఇప్పుడు సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ సైట్ మనకు ఎప్పుడైనా క్లోజ్ కావచ్చు. మీరు వీలంత తొందరగా మీ సమీపంలోని గ్రామసచివాలయంలో వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వద్ద కలిసి మీ వివరాలను ఎడిట్ చేయించుకోండి. 

Leave a Comment