కరోనాను జయించిన అమితాబ్..!

బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో జూలై 11న ఆయన ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. 23 రోజుల తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజులు ఆయన ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటారు. దీంతో ఆయన తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

అయితే ఆయన కుమారుడు హీరో అభిషేక్ బచ్చన్ మాత్రం కరోనా నుంచి కోలుకోలేదు. ఇంకా ఆస్పత్రిలోనేే చికిత్స పొందుతున్నారు. ఇక తాను కూడా త్వరలో కోలుకుంటానని అభిషేక్ ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల ఆయన కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య ఇద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. 

 

Leave a Comment