అమిత్ షా – బాద్ షా భేటీ.. అసలు రహస్యం ఇదే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. శంషాబాద్ విమానాశ్రయంలోని నోవాటెల్ హోటల్ లో సుమారు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వచ్చి ఉంటాయ్? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఎన్టీఆర్ ఇమేజ్ ని దేశవ్యాప్తంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ కనబరిచిన అభినయం అమిత్ షాను అమితంగా ఆకట్టుకుందని, అందుకే ఆయన్ను అభినందించడానికి కలిశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమా తీసినట్లు.. తెలంగాణలో ‘ది రజాకార్ ఫైల్స్’ తీయాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. అందులో ఎన్టీఆర్ నటిస్తే దేశవ్యాప్తంగా మైటేజ్ ఉంటుందని బీజేపీ భావిస్తోందట.. అందుకే ముందుగా ప్లాన్ చేసిన షెడ్యుల్ లో లేనప్పటికీ ఎన్టీఆర్ ని అమిత్ షా కలవడం వెనుక కారణం ఇదే అంటున్నారు. 

రాజకీయ వ్యూహమే: కొడాలి నాని

ఎన్టీఆర్-అమిత్ షా భేటీపై కొడాలి నాని స్పందించారు. రాజకీయ వ్యూహంలో భాగంగానే ఈ భేటీ జరిగి ఉంటుందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఎన్టీఆర్ సేవలను వినియోగించుకోవడానికి కూడా అయుండొచ్చని నాని తెలిపారు. కేవలం సినిమాలు బాగున్నాయని ఎన్టీఆర్ ను అభినందించేందుకే అంటే మాత్రం తాను నమ్మడం లేదన్నారు. బీజేపీకి రాజకీయంగా ఉపయోగం లేకుంటే మోడీ, అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవర్నీ కలవరని కొడాలి నాని వ్యాఖ్యానించారు.  

 

Leave a Comment