విశాఖలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్  కార్యాలయం

అమరావతి: విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా నిర్ణయించాక ఆ దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ మున్సిపల్ శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. విశాఖలో 79.91 కిలోమీటర్లు మేర లైట్ మెట్రోరైలు కారిడార్ ను 60 కిలోమీటర్ల మేర ట్రామ్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు ఏర్పాటు చేసింది. డీపీఆర్‌ల రూపకల్పనకు కొటేషన్లు పిలిచింది. ప్రతిపాదిత 79.91 కిలోమీటర్ల విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు 60 కిలోమీటర్ల మేర లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు పనులన్నీ ఇక ఈ ప్రాంతీయ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి.

 

Leave a Comment