ప్రజలే మా మొదటి ప్రాధాన్యత.. పెట్రోల్ ధరల తగ్గింపుపై ప్రధాని మోడీ..!

దేశంలో అధిక ధరలతో అల్లాడుతున్న ప్రజలకు కేంద్రం ఊరటనిచ్చింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామాన్ శనివారం ట్వీట్ చేశారు. దీంతో పెట్రోల్ ధర లీటర్ కు రూ.9.5, డీజిల్ ధర రూ.7 చొప్పున తగ్గుతుందని పేర్కొన్నారు.

 రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గించాలని నిర్మాలా సీతారామన్ కోరారు. ఇక ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన లబ్ధిదారులకు ఒక్కో గ్యాస్ సిలిండర్ పై రూ.200 రాయితీ ప్రకటించారు. ఏడాదిలో 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుందన్నారు. ప్లాస్టిక్, ఉక్కు ఉత్పత్తులకు అవసర ముడిసరకులు, ఉపకరణాలపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. సిమెంట్ ధర తగ్గింపునకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

ప్రజలే మా మొదటి ప్రాధాన్యత:

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ప్రధాని మోడీ స్పందించారు. తమ ప్రభుత్వానికి ప్రజలే మొదటి ప్రాధాన్యత అని చెప్పారు. ప్రజా ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం పడుతుందని మోడీ తెలిపారు. గ్యాస్ సిలిండర్ పై రూ.200 సబ్సిడీ ఇవ్వాలనే నిర్ణయం కుటుంబ బడ్జెట్ ను సులభతరం చేస్తుందన్నారు. ఉజ్వల యోజన పథకం ద్వారా కోట్టాది మంది భారతీయులకు లబ్ధి చేకూరుతోందన్నారు. 

 

Leave a Comment