ప్రముఖ హాస్య నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ‘అల్లు రామలింగయ్య’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామలింగయ్య జీవిత చరిత్ర పుస్తకాన్ని లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ తనకు 16 ఏళ్లు వచ్చే వరకు తాతయ్య, నానమ్మలతో ఉన్నానని, తాతయ్య చనిపోయాక రూ.10 లక్షల ఇన్స్యూరెన్స్ డబ్బు వచ్చిందని అన్నారు. 8 మంది మనవళ్లు, మనవరాళ్లు ఉన్నా ఆ డబ్బు ఎవరికీ రాలేదు.. తనకు మాత్రమే వచ్చిందన్నారు. అలా ఎలా వచ్చిందని బీమా కట్టిన సంవత్సరాన్ని చూశానని, తాతయ్య డబ్బు జమ చేయడం స్టార్ట్ చేసిన సమయంలో తాను నాలుగో తరగతి చదువుతున్నానని అన్నారు.
వీడు జీవితంలో ఎందుకూ పనికిరాడని, 18 ఏళ్లు వచ్చాక ఈ రూ.10 లక్షలు ఉపయోగపడతాయని భావించి ఈ డబ్బు తన కోసమే జమ చేశారని బన్నీ చెప్పారు. తన తాత దృష్టిలో తాను ఎందుకూ పనికిరాని వాడినని, ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానని, అందుకు ఆనందంగా ఉందని తెలిపారు. ఆయన కూడా తన ఎదుగుదలను చూసి ఉంటే బాగుండేదని భావోద్వేగానికి గురయ్యారు.