రోడ్డు పక్కన బండి వద్ద టిఫిన్ చేసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్..!

135
Allu Arjun

సెలబ్రెటీలు అంటే ఎంత లగ్జరీగా ఉంటారో తెలియంది కాదు. వారు తినే ఫుడ్ దగ్గరి నుంచి వేసుకునే బట్టలు, చెప్పులు ప్రతీదీ బ్రాండ్ అయి ఉండాలి. కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాదాసీదాగా రోడ్డు పక్కన హోటల్ లో టిఫిన్ చేశాడు. తర్వాత బయటకు వచ్చి బిల్లు కట్టాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడగియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప షూటింగ్ లో భాగాంగా ఇటీవల కాకినాడకు వెళ్లాడు. అక్కడ రంపచోడవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొన్ని యాక్షన్ సీన్లు చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా టీంతో కలిసి తూర్పు గోదావరి జిల్లా గోకవరం మీదుగా వెళ్తుండగా దివంగత ఎన్టీఆర్ విగ్రహం పక్కనే ఓ చిన్న హోటల్ ఉంది. ఆ హోటల్ లో బన్నీ టిఫిన్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు, అతడి ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు.  

Previous articleనెల్లూరు జిల్లాలో దారుణం.. వ్యభిచారం చేయాలంటూ యువతిపై దాడి.. వీడియో వైరల్..!
Next articleఫుట్ బాల్ ఆడుతున్న ఎలుగుబంట్లు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here