అమెరికాలోనూ తగ్గేదే లే.. అల్లు అర్జున్ కు అరుదైన గౌరవం..!

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ కు అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా న్యూయార్క్ లోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్స్ నిర్వహించిన పరేడ్ కి బన్నీ గ్రాండ్ మార్షల్ గా వ్యవహరించారు. అమెరికాలో నివసిస్తున్న భారతీయ ప్రవాసులు ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీన్నే ‘ది ఇండియా డే పరేడ్’ అని పిలుస్తారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఈవెంట్ లో గ్రాండ్ మార్షల్ గా అల్లు అర్జున్ ప్రాతినిధ్యం వహించాడు. దీనికి సంబంధించిన సర్టిఫికెట్ ను న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్, అల్లు అర్జున్ కి అందించారు.

ఈవెంట్ కి అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి హాజరయ్యాడు. అల్లు అర్జున్ ఈ వేడుకలో త్రివర్ణ పతకాన్ని ఊపుతున్న ఫొటోలను, ఆడమ్స్ తో కలిసి దిగిన ‘తగ్గేదే లే’ మ్యానరిజం స్టిల్ ని బన్నీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. న్యూయార్క్ లో జరిగిన ఇండియా డే పరేడ్ లో భాగం కావడం, గ్రాండ్ మార్షల్ బిరుదుతో గౌరవం పొందడం ఆనందంగా ఉందని అల్లు అర్జున్ పేర్కొన్నాడు.   

 

 

 

 

Leave a Comment