ఆర్ఆర్ఆర్ పై హాలీవుడ్ భామ సంచలన పోస్ట్..!

రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సినిమా విడుదల తేదీని చిత్రం యూనిట్ గోప్యంగా ఉంచింది. విడుదల తేదీని ఇంత వరకు ప్రకటించలేదు. కానీ ఐరిష్ నటి అలిసన్ డూడీ సినిమా విడుదల తేదీని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఆర్ఆర్ఆర్ అనే అకౌంట్ ను జత చేస్తూ రిలీజ్ అక్టోబర్ 8న అని అందులో రాసుకొచ్చింది. అయితే తాను చేసిన పొరపాటును వెంటనే గ్రహించిన అలీసన్ డూడీ ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే కొంతమంది ఆ పోస్టు యొక్క స్క్రీన్ షాట్లను తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటీష్ కాలంలో జరిగిన కథగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సినమాలో ఈ హాలీవుడ్ భామ ఓ నెగటివ్ రోల్ పోషిస్తోంది. కాగా, ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ కనిపించనున్నారు.    

Leave a Comment