‘అగ్నిపథ్’ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల..!

ఆర్మీలో అగ్నివీరుల నియామకాల కోసం ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 20 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అగ్నిపథ్ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది. 

అంతేకాదు.. ఎయిర్ ఫోర్స్, నేవీలో కూడా అగ్నివీర్ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. జూన్ 21న ఇండియన్ నేవీ నోటిఫికేషన్, జూన్ 24న ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా.. కేంద్రం మాత్రం తగ్గేదేలా అంటూ దూకుడు పెంచింది.

 

  

 

Leave a Comment