న్యూస్ ఛానెళ్ల TRP రేటింగ్స్ నిలిపివేత..

బ్రాడ్ కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) కీలక నిర్ణయం తీసుకుంది. న్యూస్ ఛానెళ్ల వీక్లీ రేటింగ్స్ విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 12 వారాల పాటు దేశవ్యాప్తంగా న్యూస్ ఛానెళ్ల వ్యూయరిషిప్ రేటింగ్ ను నిలిపివేయనుంది. దీంతో ఈ వారం విడుదల చేయాల్సిన న్యూస్ ఛానెళ్ల వ్యక్తిగత రేటింగ్ ను బార్క్ ప్రకటించడం లేది పేర్కొంది. అన్ని హిందీ, ప్రాంతీయ, ఇంగ్లీష్ న్యూస్ మరియు బిజినెస్ న్యూస్ ఛానెళ్లకు ఇది వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. 

కాగా, రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రమాణాలను సమీక్షించి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలని బార్క్ నిర్ణయించింది. వార్తా ప్రసారాలకు ప్రాతినిధ్యం వహించే న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) కూడా బార్క నిర్ణయాన్ని స్వాగితించింది. బార్క్ లో ముఖ్యమైన సంస్కరణలను అమలు చేయడానికి సస్పెన్షన్ కాలం ఉపయోగపడుతుందని ఎన్బీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ పేర్కొన్నారు. 

అయితే ఇటీవల న్యూస్ ఛానెళ్లపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొంత కాలంగా ఛానెల్ రేటింగ్ ను కొనుగోలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై బార్క్ వివరణ ఇస్తూనే ఉంది. ఈక్రమంలో ముంబైలో రేటింగ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పలు ఛానెళ్లు పోలీసులను కోరుతున్నాయి.  

  

Leave a Comment