6 నెలల క్రితం ఆర్థిక మంత్రి.. ఇప్పుడు టాక్సీ డ్రైవర్..!

ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరూ.. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరూ.. అని ఓ పాట ఉంది గుర్తుందా.. అంతేకాదు.. ఓడలు బండ్లు అవుతాయ్.. బండ్లు ఓడలు అవుతాయ్.. అనే సామెత కూడా ఉంది.. సరిగ్గా ఇదే వర్తిస్తుంది ఈ మాజీ మంత్రి ఖలీద్ పయెండాకి.. సరిగ్గా ఆరునెలల క్రితం ఆఫ్ఘానిస్తాన్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు.. తిరిగిచూస్తే అమెరికాలో క్యాబ్ డ్రైవర్ గా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.. 

ఆఫ్ఘానిస్తాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ప్రజలతో పాటు అప్పటి ప్రభుత్వాధినేతలు సైతం ఇప్పుడు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. తాలిబన్ల ఆక్రమణకు ముందు ఆఫ్ఘాన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో వేలకోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు ఖలీద్. ఇప్పుడు వాషింగ్టన్ రోడ్లపై క్యాబ్ నడుపుకుంటున్నారు. ది వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఖలీద్ ని ఇంటర్వ్యూ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాకా.. ఆఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ యూఏఈ పారిపోయారు. ఆయన మంత్రి వర్గంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఖలీద్ తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్లిపోయారు. అక్కడ కుటుంబ పోషణ కోసం ఖలీద్ క్యాబ్ డ్రైవర్ గా అవతారమెత్తారు.

ఒకప్పుడు వేలకోట్ల రూపాయల ఆఫ్ఘన్ బడ్జెట్ కి బాధ్యుడిగా ఉన్న ఖలీద్.. ఇప్పుడు రోజు ఆరు గంటల పాటు కారు నడిపి 150 డాలర్లు సంపాదిస్తున్నారు. దీంతో పాటు జార్జ్ టౌన్ యూనివర్సిటీలోని వాల్ష్ స్కూల్ ఆఫ్ ఫారెన్ సర్వీసెస్ విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తనకు ఓ ప్లేస్ అంటూ లేకుండా పోయిందని ఖలీద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫ్ఘానిస్తాన్ లో సంక్షోభానికి అమెరికా కూడా ఒక కారమణమంటున్నారు ఖలీద్..  

 

Leave a Comment