పవన్ కళ్యాణ్ కలిస్తే 100 ముద్దులు ఇస్తా : సురేఖ వాణి

హీరోల్లో చిరంజీవి అంటే చాలా ఇష్టమని, ఆయన్ను చూసినప్పుడు తన కళ్లల్లో నీళ్లు తిరుగాయని నటి సురేఖ వాణి చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. తన భర్త చనిపోవడంతో అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయని, అందుకే బయటకు వచ్చానని భావోద్వేగానికి లోనయ్యారు. 

ఇన తాను బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించానని, హిందీలో మిథున్ చక్రవర్తి, జాకీష్రాఫ్ నటించిన సినిమాల్లో చెల్లెలి పాత్రలు చేశానని పేర్కొన్నారు. విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమాలో కూడా నటించానని, అయితే థియేటర్లలో తన సీన్ కట్ చేశారని సురేఖ్ వాణి తెలిపారు. అయితే అమెజాన్ ప్రైమ్ లో మాత్రం విజయ్ తో చేసిన సీన్లు ఉన్నాయని పేర్కొన్నారు. 

ఇక పరిశ్రమలోని హీరోల్లో ఎవరికైనా 100 ముద్దులు ఇవ్వాలనుకుంటే ఎరికిస్తారని హోస్ట్ అడిగిన ప్రశ్నకు సురేఖ వాణి ఆశ్చర్యపరిచే సమాధానం ఇచ్చారు. హీరోల్లో ఎవరికైన వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే పవన్ కళ్యాణ్ కు ఇస్తానని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పేశారు. అయితే ఈ మధ్య కాస్తా సినిమాలు తగ్గించిన సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు.

Leave a Comment