పవన్ కల్యాణ్ ఒప్పుకుంటే నాలుగో భార్యగా ఉంటా : నటి అషూరెడ్డి

బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటి అషూ రెడ్డి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని. గతంలో తన ప్రైవేట్ పార్ట్ పై పవన్ కల్యాణ్ పేరును పచ్చబొట్టు కూడా వేయించుకుంది. తాజాగా అషూరెడ్డి పవన్ కల్యాణ్ ను కలిసింది. ఇద్దరూ ఒకే చోట షూటింగ్ చేస్తుండటంతో పవన్ కల్యాణ్ ను కలిసే అవకాశం కలిగింది. 

ఈ సందర్భంగా ‘మీరు కోరుకున్నవన్నీ మీ జీవితంలో జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ పవన్ లేఖ ఇచ్చారు. ఆ లేఖను అషూరెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. తన దేవుడిని మళ్లీ కలుసుకున్నానని, ఆయన తనతో పాటు తాను వేసుకున్న టాటూ కూడా గుర్తుందని చెప్పారని రాసుకొచ్చింది. దాదాపు 2 గంటలు మాట్లాడుకున్నామని, ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పింది. తిరిగి వెళ్లేటప్పుడు ఓ స్వీట్ లెటర్ కూడా ఇచ్చారని, మీరు ఎప్పటికీ తన ఫస్ట్ లవ్ పవన్ కల్యాణ్ అని తన అభిమానాన్ని చాటుకుంది. 

ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఓ నెటిజన్ ఆమెకు ఊహించని ప్రశ్న వేశాడు. ఒక వేళ పవన్ కల్యాణ్ మీకు నాలుగో భార్యగా ఉండే అవకాశం ఇస్తే ఒప్పుకుంటారా? అని ప్రశ్నించాడు. దీనికి అషూరెడ్డి తప్పకుండా ఓకే చెబుతానని జవాబు ఇచ్చింది. ఆషూ ఇచ్చిన జవాబు స్కీన్ షాట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)

Leave a Comment