పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో నటి అరెస్ట్..!

పోర్న్ వీడియోల చిత్రీకరణ కేసులో నటి, మోడల్ గెహ్నా వశిష్ట్ ను పోలీసులు అరెస్టు చేశారు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని వెబ్ సైట్లలో పెడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహానాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై, మలద్ లోని మల్వానీ ఏరియాలోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియో చిత్రీకరణ జరుగుతోందని క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమచారం అందింది. 

దీంతో పోలీసులు ఆ బంగ్లాపై రైడ్ నిర్వహించారు. ఈ రైడ్ లో ఐదుగురిని అదుపులోకి తీసుకోగా అందులో ఇద్దరు నటులు, ఓ లైట్ మ్యాన్, మహిళ ఫొటో గ్రాఫర్, గ్రాఫిక్ డిజైనర్ ఉన్నారు. ఈ పోర్న్ వీడియో రాకెట్ నుంచి ఓ మహిళను సంరక్షించారు. వీరు మొబైల్ ఫోన్ల ద్వారా వీడియోలు తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.5 లక్షలు విలువ చేసే 6 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. 

దాదాపు 87 వీడియోలను ఆమె గెహానా తన వెబ్ సైట్లలో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఆమె సైట్లలో పోర్న్ వీడియోలు చూడాలంటే సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. సైట్ లో సబ్ స్క్రైబ్ చేసుకునేందుకు రూ.2 వేలు కట్టాలని పోలీసులు తెలిపారు. 

కాగా, గెహానా మోడల్ గా చాలా బ్రాండ్లకు ప్రకటనలు చేశారు. అంతే కాకుండా 2012లో మిస్ ఆసియా బికినీగా కిరీటం కూడా పొందారు. ‘ఫిల్మీ దునియా’ సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమకు పరిచమయ్యారు. పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. 2007లో వచ్చిన ఆపరేషన్ దుర్యోధనలో ఐటమ్ సాంగ్ చేశారు. ఆపరేషన్ దుర్యోధన 2, అనుకున్నది ఒకటి అయినది ఒకటి, నమస్తే, 33 ప్రేమ కథలు, ఐదు, ప్రేమించు పెళ్లాడు, బీటెక్ లవ్ స్టోరీస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.  

 

You might also like
Leave A Reply

Your email address will not be published.