నటుడు ఉత్తేజ్ భార్య మృతి..చిరును పట్టుకుని రోదించిన ఉత్తేజ్..!

148
Uttej Wife

ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం జరిగింది. ఆయన సతీమణి పద్మావతి మృతి చెందింది. హైదరాబాద్ లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూశారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పద్మావతిని బసవతారకం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. 

ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాశ్ రాజ్, జీవిత రాజశేఖర్ తో పాటు పలువురు నటీనటులు ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మెగాస్టార్ చిరంజీవిని పట్టుకుని రోదించారు ఉత్తేజ్.. ఆయన కుమార్తెను జీవిత రాజశేఖర్ ఓదార్చారు. ఉత్తేజ్ బాధ చూసి ప్రకాశ్ రాజ్ కంటతడి పెట్టారు. 

ఉత్తేజ్ తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపు 200 చిత్రాల్లో నటించారు. అటు సినిమాల్లో నటిస్తూనే సేవా కర్యక్రమాలు చేసేవారు. ఉత్తేజ్ చేసే సేవా కార్యక్రమాల్లో ఆయన భార్య పద్మావతి భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్ కు చెందిన మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.    

Previous articleకూతురు ప్రేమించిందని చరిత్రలో చూడని శిక్ష వేసిన తల్లి..!
Next articleరెండు డోసులు టీకా తీసుకున్న వారిలో పెరగని యాంటీబాడీలు..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here