నటుడు ఆర్.నారాయణమూర్తి అరెస్ట్..!

నటుడు ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు రోడ్ల మీద నినాదాలు చేస్తున్నారు. 

తాజాగా హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. అందులో ఎంతో మంది రైతులు పాల్గొన్నారు. వారికి తోడుగా నారాయణ మూర్తి కూడా మద్దతు పలికారు. రాజ్ భవన్ ముట్టడించడానికి వచ్చిన రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఆర్.నారాయణమూర్తి కూడా ఉన్నారు. ఈ చట్టం ద్వారా రైతులు నష్టపోతున్నారని, వెంటనే వెనక్కి తీసుకోవాలని నారాయణమూర్తి కోరారు.  

Leave a Comment