స్విమ్మింగ్ లో పతకం సాధించిన హీరో మాధవన్ కొడుకు..!

స్టార్ హీరో మాధవన్ కొడుకు వేదంత్ స్విమ్మింగ్ లో సత్తా చాటుతున్నాడు. ఇప్పటికే భారత్ కు పలు పతకాలను తీసుకొచ్చిన వేదాంత్.. తాజాగా మరోసారి సిల్వర్ మెడల్ సాధించాడు.. డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లో జరిగిన డానిష్ స్విమ్మింగ్ ఓపెన్ లో వేదాంత్ సిల్వర్ మెడల్ సాధించాడు. 1500 మీటర్ల ఫ్రీ స్టయిల్ ఈవెంట్ లో వేదాంత్ ఈ ఘనత సాధించాడు. 

ఈ విషయాన్ని హీరో మాధవన్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. తన కుమారుడు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ఈ పోటీల్లో మెన్స్ 200 మీటర్ల బటర్ ఫ్లై ఈవెంట్ లో భారత టాప్ స్విమ్మర్ సజన్ ప్రకాశ్ స్వర్ణం సాధించాడు. ప్రకాశ్ ని కూడా మాధవన్ అభినందించారు. వేదాంత్ గురువు ప్రదీప్ కి కూడా మాధవన్ ధన్యవాదాలు తెలిపారు. 

కాగా.. హీరో మాధవన్ కొడుకు వేదాంత్ సినిమాలవైపు కాకుండా క్రీడల వైపు ఫోకస్ పెట్టాడు. హీరోల కుమారులు హీరోలుగా మారడానికే ఆసక్తి చూపిస్తున్న తరంలో వేదాంత్ మాత్రం స్విమ్మింగ్ లో భారత్ కి పతకాల పంట పండించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.   

Leave a Comment