ఈ-పాస్ గా ‘ఆరోగ్య సేతు’ యాప్

కరోనా వైరస్ నియంత్రించడంలో భాగంగా కేంద్రం రూపొందించిన Aarogy Setu యాప్ ను ఇప్పటి 5 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ మరో రెండు కొత్త ఫీచర్లను చేర్చింది. Aarogy Setu యాప్ ను e-passగా కూడా ఉపయోగించుకోవచ్చు. లాక్ డౌన్ వేళ బయట తిరగడానికి వీలుగా కరోనా లక్షణాలు, ఉత్పత్తి స్థానం, మాత్రికలను బట్టి దీనిని రూపొందించారు. ఇందులో గ్రీన్, ఆరెంజ్, రెడ్ రంగులు ఉంటాయి. 

రెడ్ కలర్ వస్తే వారు ఎవరినీ కలవకూడదు. పూర్తిగా ఇంట్లో నిర్బంధంలో ఉండాలి. ఆరెంజ్ కలర్ వస్తే వారు ఎవరితోనూ కలవకూడదు. ఆఫీస్ కు మాత్రమే వెళ్లాలి. ఇంటికి సంబంధించిన కార్యకలాపాల్లోనే పాల్గొనాలి. ఇక గ్రీన్ కలర్ వస్తే వారు బహిరంగ ప్రదేశాల్లో స్వేచ్ఛగా తరగవచ్చు. 

Aarogy Setu యాప్ లో ఈ-పాస్ తో కొత్తగా మరో ఫీచర్ అప్ డేట్ చేశారు. Covid-19కు సంబంధించిన సమాచారాన్ని ఇందులో చూడవచ్చు. దేశంలో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల వివరాలు, ఏ ఆస్పత్రుల్లో ఏయే సౌకర్యాలున్నాయి, ఒక వేళ కరోనా వస్తే ఎవరిని ఎలా సంప్రదించాలి తదితర సమాచారం ఇందులో ఉంటుంది. ప్రస్తుతం ఇందులో ఈ ఒక్క ఫీచర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ-పాస్ ఫీచర్ ఇంకా అప్ డేట్ కాలేదు. తర్వలో ఈ ఫీచర్ అప్ డేట్ కానుంది.  

Leave a Comment