దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఆధార్ సేవలు..

లాక్ డౌన్ కారణంగా మూసివేయబడిన అన్ని ఆధార్ సేవా కేంద్రాలు ఇప్పుడు క్రమంగా తెరుచుకుంటున్నాయి. ఇప్పుడు మీరు ఆధార్ కార్డులో ఏదైనా అప్ డేట్ చేయాలనుకుంటే లేదా కొత్త ఆధార్ తయారు చేయాలనుకుంటే, మీరు బ్యాంక్, పోస్టాపీస్ మరియు ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లవచ్చు. కొన్ని రాష్ట్రాలు నిబంధనలతో బేస్ సెంటర్లను కూడా తెరిచాయి. 

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఆంక్షల సడలింపుతో 14,000 ఆధార్ కేంద్రాలు తెరిచి ఉన్నట్లు యూనిక్ ఐడెంఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ప్రకటించింది. దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ నిర్వహించే 14,000 ఆధార్ కేంద్రాలు తెరిచి ఉన్నట్లు తెలిపింది. ఇక UIDAI నిర్వహిస్తున్న ఆధార్ కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి. 

మన తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నాలుగు చోట్ల ఆధార్ సేవా కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని మాదాపూర్, వరంగల్ లోని నయీంనగర్, విజయవాడలోని లబ్బిపేట, విశాఖపట్నంలోని ద్వారకానగర్ లో UIDAI ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. దేశవ్యాప్త ఆధార్ కేంద్రాలతో పాటు ఇవి కూడా తెరుచుకున్నట్లు UIDAI ప్రకటించింది. 

Leave a Comment