సొంత చెల్లిపై అన్నయ్యల లైంగిక వేధింపులు.. ఇంట్లో చెబితే ఇదంతా కామన్ అంటున్నారు..!

చెల్లికి అండగా ఉండాల్సిన అన్నయ్యలు కీచకులయ్యారు.. సొంత చెల్లిపై చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కన్నతల్లితో పాటు పెద్దమ, పెద్దనాన్నలకు ఈ విషయం చెప్పినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తనకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించింది ఓ 20 ఏళ్ల యువతి.. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్త గూడెం పట్టణానికి చెందిన ఓ 20 ఏళ్ల యువతి తండ్రి ఆమె చిన్నతనంలోనే ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి చూసేది. ఆ యువతి చిన్నతనంలో వీరి కుటుంబం మణుగురులో ఉండేది. ఆ యువతి 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి సొంత అన్నయ్య ఆమెపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడేవాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించేవాడు.. 

కొన్నాళ్ల క్రితం అతడికి ఉద్యోగం వచ్చింది. దీంతో అంతా కొత్తగూడెంకు వచ్చారు. అయినప్పటికీ అతడి తీరులో మాత్రం మార్పు రాలేదు. దీంతో అన్నయ్య నుంచి తప్పించుకునేందుకు ఇంటర్ చదివే సమయంలో కొత్తగూడెంలోనే ఉన్న పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ కూడా వరుసకు అన్నయ్య అయిన పెద్దమ్మ కొడుకు ఆ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఎరికైనా విషయం చెబితే చంపేస్తామని బెదిరించాడు. 

ఈ విషయాన్ని తల్లితో పాటు పెద్దమ్మ, పెద్దనాన్నలకు చెప్పినా వారు పట్టించుకోలేదు. అంతేకాదు ఆమెపై అసభ్యకరంగా మాట్లాడేవారు. ఇటీవల మెడిసిన్ ఎంట్రన్స్ శిక్షణ నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లింది. అయితే లాక్ డౌన్ సమయంలో మళ్లీ ఇంటికి వెళ్లక తప్పలేదు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మళ్లీ అన్నయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రోజురోజుకు అతడి వేధింపులు ఎక్కవ అవుతుండటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు అన్నయ్యలతో పాటు తల్లి, పెద్దమ్మ, పెద్దనాన్న నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

Leave a Comment