తల వెంట్రుకలే యమపాశమై.. హైదరాబాద్ లో యువతి దుర్మరణం..!

గోకార్టింగ్ సరదా బీటెక్ విద్యార్థి ప్రాణం తీసింది. ఈ ఘటన హైదరాబాద్ లోని గుర్రంగూడ గోకార్టింగ్ ప్లే జోన్ లో గురువారం జరిగింది. హైదరాబాద్ వనస్థలీపురంకు చెందిన శ్రీవర్షిణి బీటెక్ చదువుతోంది. ఆమె సరదాగా గడిపేందుకు ఫ్రెండ్స్ తో కలిసి గోకార్టింగ్ ప్లే జోన్ కు వచ్చింది. ప్లే జోన్ లో ఉన్న కారులో కాసేపు రౌండ్స్ వేద్దామనుకుంది. గోకార్టింగ్ చేస్తుండగా ఆమె వెంట్రుకలు కారు టైరులో చిక్కుకుపోయాయి.

 దీంతో ఆ యువతి ఒక్కసారిగా ఎగిరి రోడ్డుపై పడిపోయింది.వేగంగా వెళ్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో శ్రీవర్షణి తల బలంగా నేలకు తగిలింది. ఆమె పెట్టుకున్న హెల్మెట్ కూడా పగిలిపోయి తలకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. గోకార్టింగ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 

  

Leave a Comment