సోనూసూద్ కోసం 700 కి.మీ. పాదయాత్ర.. చలించిపోయిన సోసూసూద్..!

సోనూసూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మందిని ఆదుకుని రియల్ హీరో అనిపించుకున్నారు. ఏ కోటీశ్వరుడు చేయని మంచి పనులు చేస్తుండటంతో ఆయనకు మంచి క్రేజ్ ఏర్పడింది. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. దేశవ్యాప్తంగా సోనూసూద్ ను అభిమానించేవారు, ఆరాాధించేవారు అధికంగా ఉన్నారు. ఆయనతో కలవాలని, ఫొటో దిగాలని చాలా మంది అనుకుంటున్నారు. 

ఈక్రమంలో తెలంగాణ రాష్ట్ర వికారాబాద్ కు చెందిన వెంకటేశ్ అనే యువకుడు ఎవరూ చేయని సాహసం చేశాడు. తన వీరాభిమానిని కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర చేపట్టాడు. సుమారు పది రోజుల్లో 700 కిలోమీటర్లు నడిచి ఎట్టకేలకు సోనూసూద్ ను కలిశాడు. 

ఇక తన కోసం కాలినడకన వచ్చిన అభిమానిని చూసి సోనూసూద్ చలించిపోయారు. అతడిని ఇంటికి పిలిచి కాసేపు అతడితో మాట్లాడారు. వెంకటేశ్ తనకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాడని సోనూసూద్ పేర్కొన్నారు. కానీ దయచేసి ఎవరూ ఇలాంటి పనులు చేయవద్దని తన అభిమానులను కోరారు.  

 

 

Leave a Comment