సుశాంత్ సింగ్ కు అద్భుతమైన వీడ్కోలు..

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల క్రితం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే..అయితే సుశాంత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ శుక్రవారం ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ హాట్ స్టార్ ద్వారా ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే సుశాంత్ జ్ఞాపకార్థం ఈ సినిమాను అందరికీ ఉచితంగా చూసే అవకాశం కల్పించారు. 

ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తూన్న అభిమానులు సుశాంత్ కు అద్భుతమైన వీడ్కోలు పలికారు. ఈ సినిమాను భారీ హిట్ చేశారు. ఐఎంబీడీలో 20 వేలకుపైగా ఓట్లతో 9.8 రేటింగ్ సాధించింది. భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక ఐఎంబీడీ రేటింగ్ సాధించిన చిత్రంగా దిల్ బేచారా రికార్డులకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ కూడా మోస్ట్ లైక్డ్ ట్రైలర్ గా రికార్డు క్రియేట్ చేసింది. 

ఈ సినిమా ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేని అభిమానులు సినిమాలో కూడా సుశాంత్ చనిపోయే సన్నివేశం ఉంటడంతో సినిమాను చూసిన వారు మరింత ఫీల్ అవుతూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.  

ఈ సినిమా కథను హాలీవుడ్ హిట్ సినిమా ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా తెరకెక్కించారు. కానీ ఈ కథ మన తెలుగు సినిమా గీతాంజలిని పోలీ ఉంటుంది. ఇందులో సుశాంత్ సరసన సంజనా సంఘీ నటించారు. సైఫ్ అలీఖాన్, స్వస్తా ఛటర్జీ, స్వస్తిక్ ముఖర్జీ, సాహిల్ వాయిద్ కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకు ముఖేష్ చాబ్రా దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. 

 

Leave a Comment