50 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన మహిళ..!

ఈరోజుల్లో చాలా మంది పిల్లలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు కలగకపోవడంతో ఎంతో నిరుత్సాహానికి లోనవుతున్నారు. అయితే చాలా మంది వైద్యుల సలహాతో ఏఐ పద్ధతిలో పిల్లలను కంటున్నారు. తాజాగా రాధిక అనే 50 ఏళ్ల మహిళ కృత్రిమ గర్భధారణ ద్వారా కవలల పిల్లలకు జన్మనిచ్చింది. 

రాధికకు పెళ్లయి 25 ఏళ్లు అవుతున్నా పిల్లలు కలగకపోవడంతో.. ప్రైవేల్ ఆస్పత్రిలో రూ.5 లక్షలు ఖర్చు చేసి ఏఐ పద్ధతిలో చికిత్స తీసుకుంది. ఆమెకు ఎనిమిదో నెలలో కాళ్ల వాపు తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో ఆమె ఖర్చు భరించలేక చెన్నై ఎగ్మూరు ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. అత్యవసర చికిత్స విభాగంలో ఆమెను ఉంచి, ప్రత్యేక డాక్టర్లతో చికిత్స అందించారు. 

స్కానింగ్ లో పిల్లల్లో రక్తప్రసరణ సక్రమంగా లేకపోవడంతో మెదడు అభివృద్ధి చెందలేదని తెలిసింది. దీనికి వైద్యులు ఆమెకు మెరుగైన చికిత్స అందించారు. ఆమెకు ఆపరేషన్ చేయడంతో కవలల పిల్లలకు జన్మనిచ్చింది. నెలరోజుల పాటు తల్లిని ఐసీయూలో, పిల్లలను ఇంక్యూబేటర్ లో ఉంచారు. ప్రస్తుతం ముగ్గురు ఆరోగ్యాంగా ఉన్నారు. 

Leave a Comment