ప్రతి ఇంట్లో యూట్యూబర్ ఉన్న గ్రామం.. ఎక్కడ ఉందో తెలుసా?

ప్రస్తుతం మేకింగ్ వీడియోలకు మంచి క్రేజ్ ఉంది. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ లో మంచి సంపాదన ఉందని అనుకుంటున్నారు. మంచి కంటెంట్ ఉంటే చాలు యూట్యూబర్ గా మారిపోతున్నారు. అయితే ఈ రోజు మనం ఓ గ్రామం గురించి తెలుసుకుందాం.. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఓ యూట్యూబర్ ఉంటాడు. ఈ గ్రామం ఛత్తీస్ గఢ్ లో ఉంది.. 

రాజధాని రాయ్ పూర్ నుంచి 45 కిలోమీటర్ల దూరం ఉన్న తులసి గ్రామం అది. ఇండియా టైమ్స్ ప్రకారం ఈ గ్రామ జనాభా 3000 మంది. 3 వేల మందిలో వెయ్యి మందికిపైగా యూట్యూబర్స్ ఉన్నారంటే యూట్యూబ్ కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ గ్రామానికి వెళ్తే.. వీధుల్లో వీడియోలు చేస్తూ కనిపిస్తుంటారు. 85 ఏళ్ల అమ్మమ్మ నుంచి 15 ఏళ్ల పిల్లవాడి వరకు అందరూ వీడియోల్లో నటిస్తారు.

గ్రామానికి చెందిన జ్ఞానేంద్ర శుక్లా, జై వర్మ అనే వ్యక్తులు తమ ప్రభుత్వ ఉద్యోగాలను వదులుకుని యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారు. తమ ఉద్యోగాలను వదిలిపెట్టి, యూట్యూబ్ ఛానెల్ ని ప్రారంభించి వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. జ్ఞానేంద్ర శుక్లా ఎస్బీఐలో నెట్ వర్క్ ఇంజనీర్ గా పని చేసేవాడు. తన యూట్యూబ్ చానెల్ కి 1.15 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. 

జై వర్మ ఎమ్మెస్సీ చదివి ప్రైవేట్ కోచింగ్ ఇచ్చేవాడు. పాఠాలు చెప్పడం ద్వారా అతను రూ.15 నుంచి 20 వేల వరకు సంపాదించేవాడు. కానీ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించినప్పటి నుంచి ఈ ఛానెల్ ద్వారా ప్రతి నెలా 30 నుంచి 35 వేల రూపాయలు సంపాదిస్తున్నాడు. వీళ్లరినీ చూసి గ్రామంలో చాలా మంది ఇన్ స్పైర్ అయ్యారు. యూట్యూబ్ కోసం కంటెంట్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. ఆ గ్రామంలో పింకీ సాహు అనే కళాకారిణీ మేకింగ్ వీడియో కంటెంట్ వీడియోలు చేస్తోంది.. చాలా మంది మహిళలు కూడా వీడియోలో కనిపిస్తున్నారు. 

Leave a Comment