ఫోన్ తో ఆడుకుంటూ..రూ.1.4 లక్షల ఆన్ లైన్ ఆర్డర్ పెట్టేసిన రెండేళ్ల బుడ్డోడు..!

ఈరోజుల్లో చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్లకు అడిక్ట్ అవుతున్నారు. పెద్ద వాళ్ల కంటే ఎక్కువగా ఫోన్లు వాడేస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏదో చూస్తున్నాడులే అని పట్టించుకోకుండా ఉంటున్నారు. అలా పట్టించుకోకుండా ఉన్న తల్లిదండ్రులకు ఓ రెండేళ్లే పిల్లవాడు షాక్ ఇచ్చాడు. ఆన్ లైన్ లో ఏకండా 1.4 లక్షల రూపాయల ఆర్డర్ పెట్టేశాడు. 

ఇంతకు ఏంజరిగిందంటే.. అమెరికా న్యూజెర్సీకి చెందిన కుమార్ కుటుంబం ఇటీవల కొత్తింటికి మారింది. ఎన్ఆర్ఐ మధుకుమార్ కి రెండేళ్ల కుమారుడు అయాన్ష్ ఉన్నాడు. అయాన్ష్ తల్లి వాల్ మార్ట్ లో ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకుని కార్ట్ లో పెట్టుకుంది. 22 నెలల కుమారుడు అయాన్ష్ కుమార్ తల్లి ఫోన్ తీసుకుని ఆడుకున్నాడు. ఈక్రమంలో వాల్ మార్ట్ లో ఆన్ లైన్ ఫర్నిచర్ ఆర్డర్ పై క్లిక్ చేసేశాడు. ఏకంగా 1700 అమెరికన్ డాలర్లు అంటే దాదాపు రూ.1.4 లక్షల ఫర్నిచర్ ఆర్డర్ చేశాడు. 

ఈ ఆర్డర్ నేరుగా ఇంటికి వచ్చేసింది. దీంతో తల్లిదండ్రులు షాక్ అయ్యారు. ముందు ఈ ఆర్డర్ తమది కాదని చెప్పారు. అయితే వాల్ మార్ట్ యాప్ చెక్ చేయగా ఆర్డర్ చేసి ఉంది. దీంతో పిల్లాడు అయాన్ష్ చేసిన పని వెలుగులోకి వచ్చింది. వాల్ మార్ట్ కి రిక్వెస్ట్ పెట్టుకోగా రిటర్న్ పాలసీకి అంగీకరించింది. ప్రస్తుతం ఈ బుడ్డోడు చేసిన పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Leave a Comment