ఒక మందిరం లేదా మసీదు దేశానికి ప్రతీక కాదు – ఓవైసీ

ఒక మందిరం కానీ, ఒక మసీదు కానీ దేశానికి ప్రతీక కాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. దేశ ప్రధానికి ఏ ఒక్క మతంపై ప్రేమ ఉండకూడదని చెప్పారు. అయోధ్యలో రామ మందిరం భూమి పూజకు ప్రధాని మోడీ హాజరుకావడంపై ఆయన మండిపడ్డారు. ఈ రోజు భారతదేశంలో లౌకికవాదం ఓడిపోయిన రోజన్నారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్ పరివార్ సుప్రీం కోర్టుకు అబద్దాలు చెప్పాయని ఆరోపించారు. ప్రధాని మోడీ హిందూత్వ వాదానికి పునాది వేశారని విమర్శించారు.

అయోధ్యలో రామమందిర భూమి పూజను దేశ ప్రజలంతా సంబరాలు జరుపుకుంటున్నారు. మతాలకు అతీతంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఓవైసీ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అంతకు ముందు కూడా బాబ్రీ మసీదు ఉండేది, ఉంది, కచ్చితంగా ఉంటుంది అంటూ ట్వీట్ చేశారు. 

 

Leave a Comment