చిన్నారి హత్య కేసులో సంచలన తీర్పు..

నిందితుడికి ఉరి శిక్ష విధించిన చిత్తూరు సెషన్స్ కోర్టు

చిన్నారి హత్య కేసులో చిత్తూరు సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడు మహ్మద్ రఫీకి ఉరి శిక్ష విధిస్తూ మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట హరనాథ్ తీర్పు ఇచ్చారు. ఫోక్సో చట్టం కింద కేసు నమోదై ఉరి శిక్ష పడ్డ తొలి కేసుగా ఏపీలో రికార్డు సృష్టించింది. గతేడాది నవంబర్ 7న కురుబల కోట మండలం చేనేత నగర్ లోని ఒక కళ్యాణ మండపానికి తల్లిదండులతో కలిసి పెళ్లికి వెళ్లిన చిన్నారిని మదనపల్లి మండలం బసినికొండ గ్రామానికి చెందిన లారీ క్లీనర్ మహ్మద్ రఫీ అత్యాచారం చేసి హతమార్చాడు. 

ఈ కేసులో నిందితుడి రఫీని నవంబర్ 16న పోలీసులు అరెస్టు చేశారు. హత్య, ఫొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోస్టు మార్టం నివేదిక పరిశీలించిన 17 రోజుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసులో న్యాయమూర్తి 41 మంది సాక్షులను విచారించి ఉరిశిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెల్లడించారు. 

Leave a Comment