వెరైటీగా ఓ కొత్త జంట ఫొటో షూట్..!

ఓ కొత్త జంట ఫొటో షూట్ ఇప్పుడు వైరల్ గా మారింది. తమ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ఓ మధుర జ్ఞాపకంలా ఉండాలని భావించిన ఓ జంట.. ఈ ఫోటో షూట్ ను డిఫెరెంట్ గా ప్లాన్ చేసింది.

కేరళకు చెందిన రిషి కార్తికేయన్, లక్ష్మి సెప్టెంబర్ 16న అతి కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా చాలా సింపుల్ గా జరిగింది పెళ్లి. దీంతో తమ ఫోస్ట్ వెడ్డింగ్ షూట్ కాస్త వెరైటీగా ఉండాలని ప్లాన్ చేసుకున్నారు. 

దీంతో కేరళలోని తేయాకు తోటల్లో తమ పోస్ట్ వెడ్డింగ్ షూట్ ను ప్లాన్ చేసుకున్నారు. ఫొటో గ్రాఫర్ అయిన తమ స్నేహితుడిని తీసుకుని వెళ్లారు. ఇక తమ మధ్య ప్రణయ బంధాన్ని ప్రతిబింబించేలా ఫొటోలు తీయించుకున్నారు.

ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి రిషి, లక్ష్మీల మీద నెటిజన్లు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ‘ఈ ఫొటో షూట్ ఏంటీ? ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. ఇంతకీ మీరు దుస్తులు ధరించారా? పిచ్చి పీక్స్ వెళ్లడం అంటే ఇదే.. ఇంతకంటే వేరే మార్గం దొరకలేదా’ అంటూ ట్రోల్ చేశారు. 

 

Leave a Comment