14 ఏళ్లుగా దీపావళి.. గణేషుడు, లక్ష్మీదేవికి పూజలు చేస్తున్న ముస్లిం కుటుంబం..!

భారతదేశంలో కుల, మత, వర్గ, జాతి భేదాలు లేకుండా అందరు సమైక్యంగా జరుపుకునే పండగ ఏదంటే అది దీపావళి.. సాధారణంగా హిందూవులు దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు చెందిన ఒక ముస్లిం కుటుంబం గత 14 ఏళ్లుగా దీపావళి సంబరాలు జరుపుకుంటోంది.

14 ఏళ్ల క్రితం కార్తీక మాసంలో ధంతేరాస్ రోజున ఈ ఇంట్లో కవలలు జన్మించారు. వీరి రాకతో ఇంట్లో సంతోషాలు వచ్చాయి. అప్పటి నుంచి ఈ ముస్లిం కుటుంబం దీపావళిని జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా దీపావళి పండుగను జరుపుకుటుంది. వీరి ఇంట్లో ఈద్ వేడుకలు ఎలా జరుగుతాయో.. దీపావళి కూడా అంతే ఘనంగా జరుగుతుంది.

కలలను హ్యాపీ అండ్ హనీ అని పిలుస్తుంటారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. ధంతేరాస్ రోజున కవల కుమారులు జన్మించారని, దీంతో ఆ రోజులు తమకు ప్రత్యేకమైందని ఇక్బాల్ భార్య రేషు తెలిపింది. వీరి పిల్లల పెట్టిన రోజును కూడా ధంతేరాస్ రోజునే జరుపుకుంటారు. అంతేకాదు వీరి ఇంట్లో ఖురాన్ తో పాటు గీత కూడా ఉంటుంది. వీరి ఇంట్లో గణేషుడికి, లక్ష్మీదేవికి ఘనంగా పూజలు నిర్వహిస్తారు. 

 

Leave a Comment