దారుణం : అల్లా కోసం కన్న కొడుకు గొంతు కోసి చంపిన తల్లి..

మూఢ విశ్వాసాలు కన్న బిడ్డలనే బలితీసుకుంటున్నాయి. ఇటీవల మదనపల్లి ఘటన మరువకముందే తాజాగా ఓ తల్లి తన బిడ్డ గొంతు కోసి హత్య చేసింది. అల్లా దయ కోసమే బలి ఇచ్చినట్లు ఆమె చెబుతోంది. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల మేరకు పాలక్కాడ్ కు చెందిన సులేమాన్, షాహీదా భార్యాభర్తలు.
సులేమాన్ గతంలో గల్ఫ్ లో పనిచేసి ప్రస్తుతం ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. షాహిదా దగ్గర్లోని మదర్సాలో టీచర్ గా పనిచేస్తోంది. వీరి ముగ్గురు సంతానం.. కాగా, శనివారం రాత్రి సులేమాన్ తన పెద్ద పిల్లలు ఇద్దరితో ఒక గదిలో పడుకోగా, షాహిదా చిన్నవాడై ఆదిల్(6)తో మరో గదిలో పడుకుంది. 

ఈక్రమంలో షాహిదా తన చిన్న కొడుకు ఆదిల్ ను తెల్లవారుజామున బాత్ రూంలోకి తీసుకెళ్లి కాళ్లు చేతులు కట్టేసి పదునైన కత్తితో గొంతుకోసి హతమార్చింది. ఆ తర్వాత తన కుమారుడిని అల్లా కోసం చంపానంటూ స్వయంగా పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చేదాక ఆమె గేటు దగ్గర నిలబడి ఎదురు చేస్తోందని పోలీసులు తెలిపారు. 

దీనికి తోడు ఘటన జరిగే ముందు రోజు పొరుగువారి నుంచి పోలీస్ స్టేషన్ నంబర్ ను షాహిదా సేకరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. షాహిదా చేతికి గాయం కూడా అయింది. దీంతో పాటు హత్య విషయం పక్క గదిలోనే ఉన్న సులేమాన్ కు తెలియకపోవడం అనుమానానికి దారితోస్తోందని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

You might also like
Leave A Reply

Your email address will not be published.