పురుషాంగానికి కోడి కాలికి ఉన్న కత్తి తగిలి వ్యక్తి మృతి..!

కోడి పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. కోడి పందెం ఆడేందుకు కోడి కాలికి కత్తి కట్టగా, అనుకోకుండా కోడి ఎగరడంతో వ్యక్తి మర్మాంగాలకు కత్తి గుచ్చుకుని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో చోటుచేసుకుంది. గొల్లపల్లిలోని లొత్తునూర్ శివారులో కోడి పందేలకు ఏర్పాట్లు చేశారు. 

కోడి పందేలకు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన పలువురు తరలివచ్చారు. వెల్గటూరు మండలం కొండాపూర్ కు చెందిన తనుగుల సతీష్(45) కూడా కోడితో అక్కడకి వచ్చాడు. తన కోడిని పందేనికి రెడీ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఓ చోట కూర్చొని తన కాళ్ల మధ్యలో కోడిని పెట్టుకుని కాళ్లకు కోడికత్తులను కట్టేందు ప్రయత్నించాడు. 

ఓకాలికి కత్తి కట్టాడు. ఇక మరోకాలికి కట్టేందుకు ప్రయత్నిస్తుండగా, కోడి తప్పించుకునేందుకు యత్నించింది. కోడిని పట్టుకునేందుకు సతీష్ ప్రయత్నించాడు. ఈక్రమంలో కోడి కాలికి కట్టిన కత్తి సతీస్ మర్మాంగానికి తగిలింది. దీంతో అతడి పురుషాంగం, టెస్టీస్ దెబ్బతిన్నాయి. సతీష్ ను ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గంమధ్యలో చనిపోయాడు. 

Leave a Comment