6 అడుగుల పామును లుంగీలో వేసుకున్నాడు..!

సాధారణంగా పాము అంటే ప్రతి ఒక్కరూ భయపడతారు.. పాము కనిపిస్తే అక్కడి నుంచి పరుగున జారుకుంటారు. కానీ ఓ వ్యక్తికి పాము అంటే భయపడలేదు కదా దానితో ఆడుకున్నాడు.. ఓ కంపెనీలో పాము చొరబడిందంటే అక్కడ వెళ్లి దాన్ని అవలీలగా పట్టుకున్నాడు. అనంతరం దాన్ని తాను కట్టుకున్న లుంగీలో వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు..

అయితే ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు..అప్పట్లో ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నంద తన ట్విట్టర్ లో పంచుకున్నారు. లుంగీని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తాజాగా ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

 

Leave a Comment