ఓ అమ్మాయి ఫోన్ నెంబర్ ను కాల్ గర్ల్ అంటూ ఫేస్ బుక్ లో పెట్టాడు.. తర్వాత ఆమెకు ఫోన్ల మీద ఫోన్లు.. 

ఒక అమ్మాయిపై ఆగ్రహంతో ఆమె ఫోన్ నెంబర్ ను ఫేస్ బుక్ లో పెట్టాడు.. కాల్ గర్ల్ అంటూ పోస్టఉ చేశాడు. దీంతో ఆ అమ్మాయికి ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. దీంతో ఆమె విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైమ్ పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ ఘటన అహ్మదాబాద్ లో జరిగింది. 

గుజరాత్ రాష్ట్రం సబర్కాంత్ జిల్లా తలోద్ ప్రాంతానికి చెందిన పప్పు మెహతా పెళ్లి చేసుకోవడం కోసం తన ప్రొఫైల్ ను మ్యాట్రీమోని వెబ్ సైట్ లో పెట్టాడు. ఈక్రమంలో అతనికి అహ్మదాబాద్ కు చెందిన అమ్మాయితో పరిచయం ఏర్పడింది. దీంతో ఇద్దరు తమ ఫోన్ నెంబర్లను మార్చుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. 

ఈ సమయంలో పప్పు మెహతా మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. దీంతో తనకు పరిచయం అయిన అమ్మాయికి కోపం వచ్చి అతన్ని పిలిపించి అసభ్యంగా మాట్లాడింది. ఈ అవమానాన్ని తట్టుకోలేపోయిన మెహతా ఎలాగైన తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో అతను ఒక ఫేక్ ఫేస్ బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అందులో ఆమె ఫోన్ నెంబర్ ను పెట్టి కాల్ గర్ల్ అని అప్లోడ్ చేశాడు. 

ఇక అంతే కాల్ గర్ల్ అని పెట్టడంతో ఆమెకు పురుషుల నుంచి ఫోన్ల మీద ఫోన్లు రావడం మొదలయ్యాయి. ఆ అమ్మాయికి అసభ్యకరమైన మెసేజ్ లు, ఫోన్లు వచ్చాయి. దీంతో ఆ అమ్మాయి విసుగు చెందింది. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ క్రైం పోలీసులు చాకచక్యంగా ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఆమెపై ఆగ్రహంతోనే ఫేస్ బుక్ లో ఇలా పోస్టు చేశానని ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. 

 

 

Leave a Comment