హైదరాబాద్ పాతబస్తీలో వరద నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి.. !

తెలంగాణ రాజధాని హైదరాబాద్ భారీ వర్షానికి అతలాకుతలం అవుతుంది. భారీ వర్షం నమోదు కావడంతో రాత్రి వరకు వీధులన్నీ నదులను తలపించాయి. ఎన్నడూ లేని విధంగా గరిష్టంగా 32 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వందేళ్లలో ఇది రెండో అత్యధిక వర్షపాతం అని పేర్కొంది. దీంతో రోడ్లపై పార్క్ చేసిన కార్లు నీటి ప్రవాహానికి కోట్టుకుపోయాయి. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఎమర్జెన్సీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. 

ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లను వరద నీరు ముంచెత్తింది. పాతబస్తీ  ప్రాంతం నీట మునిగింది. పాల్లె చెరువు పూర్తిగా నిండిపోవడంతో పాతబస్తీలో భారీగా వరద నీరు చేరింది. రోడ్ల వెంట పారుతున్న నీటి ప్రవాహం వాగులను తలిపస్తోంది. ఈక్రమంలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయాడు. ఈ వీడియో చూస్తే హైదరాబాద్ లో ఎంత భయానక పరిస్థితి నెలకొందో అర్థమవుతుంది. నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడుదామని ప్రయత్నించారు. కానీ కాపాడలేకపోయారు. అయితే గల్లంతైన వ్యక్తి వివరాలు తెలియరాలేదు. 

Leave a Comment