ఇదెక్కడి రూల్ రా సామీ.. 20 నిమిషాలు ఆలస్యం వస్తే ఉద్యోగం నుంచి తొలగించారు..!

ప్రతి కంపెనీకు కొన్ని రూల్స్ ఉంటాయి.. ఉద్యోగులు ఆఫీసులకు సమయానికి రావాలని కొన్ని కంపెనీలు రూల్స్ పెడతాయి.. ఒకవేళ లేట్ వస్తే జీతంలో కోత వేయడమో.. లేదా ఏదైన పనిష్మెంట్ విధించడమో చేస్తాయి.. ఎందుకంటే ప్రతిఒక్కరికీ ఎప్పుడో ఒకసారి అనివార్య కారణాల వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంది.. 

అయితే ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగి 20 నిమిషాలు ఆలస్యంగా వచ్చినందుకు ఉద్యోగం నుంచి తీసేసింది.. ఇంకో విషయం ఏంటంటే.. ఆ ఉద్యోగి 7 సంవత్సరాల్లో మొదటిసారిగా లేట్ రావడం గమనార్హం.. తన సహ ఉద్యోగి ఈ అంశాన్ని రెడిట్ లో షేర్ చేశాడు.. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయం తెలియలేదు.. 

రెడిట్ లోని యాంటీవర్క్ ఫోరమ్ లో ఓ వ్యక్తి ఈ పోస్ట్ షేర్ చేశాడు.. ఉద్యోగం నుంచి తొలగించిన వ్యక్తిని మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాలని మిగితా సిబ్బంది ఆందోళన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. అతడిని తిరిగి తీసుకోకపోతే సహ ఉద్యోగులందరూ ఆఫీస్ కి లేటుగా రావాలని నిర్ణయించినట్లు పేర్కొన్నాడు. సంస్థ తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది యూజర్లు తప్పుపట్టారు. 

 

Leave a Comment