కన్న కూతురిపై తండ్రి ఏడేళ్లుగా అత్యాచారం..!

కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు. ఏడేళ్లుగా కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు. ఈ ఘటన హర్యానాలో వెలుగుచూసింది. వివరాల మేరకు రాష్ట్రంలోని హిసార్ నగరంలో 17 ఏళ్ల కూతురిపై కన్న తండ్రి అత్యాచారానికి పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

గత ఏడేళ్లుగా ఆమెపై దారుణానికి ఒడిగడుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈక్రమంలో యువతి పలుమార్లు గర్భం రావడంతో దానిని తండ్రి బలవంతంగా తీయించినట్లు తెలిపారు. అంతే కాదు.. 11 ఏళ్లు ఉన్న మరో కూతురిపై కూడా నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

ఈ ఘటనపై బాధితురాలు హిసార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత ఏడేల్లుగా తనపై అత్యాచారం చేస్తున్నట్లు తెలిపింది. దానిని ప్రతిఘటించినప్పుడు తనను చంపేస్తానని బెదిరించినట్లు చెప్పింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Leave a Comment